ఆ సన్నాసి వలనే పవన్ జీవితం పాడైంది : పూనమ్

హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి రెచ్చిపోయింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఆయన్ని సన్యాసి అంటూ సంబోధించింది. ఇంతకుముందు పూనమ్ పై పవన్ పై పడిపోయేది. ఆయన మూడు పెళ్లిళ్లు, రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేసేది. పవన్ వలన పూనమ్ కి కలిగిన నష్టం ఏంటో ? తెలియదు. కానీ ప్రపంచంలో ఏ విషయాన్నైనా పవన్ తో లింకుపెట్టి ట్విట్లు చేయడం, ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకొంది. ఆ తర్వాత పవన్ స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ ని టార్గెట్ చేయడం మొదలెట్టింది. ఆయన భజనపరుడు. పవన్ ని తప్పుదారి పట్టిస్తున్నారని ఇటీవల తీవ్ర విమర్శలు చేసింది.

పూనమ్ కామెంట్స్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ… మీరు లీగల్ గా పోరాడండి అంటూ పూనమ్ కి సలహా ఇచ్చారు. దీనిపై స్పందించిన పూనమ్ షాకింగ్ కామెంట్ పెట్టింది.  ”మీ అన్న చెప్పారా? ఆయన ఓడిపోతే హ్యాపీగా ఉందా? ఆయన ఇన్సల్ట్ అయింది మీకు హ్యాపీగా ఉందా..? చెప్పండి. మూడు పెళ్లిళ్లు అని అవమానిస్తుంటే హ్యాపీగా ఉందా? ఆ సన్నాసి వల్ల మీ అన్న జీవితం పాడైందని తెలియాలి.. నమస్తే” అంటూ ట్వీట్ చేసింది. పూనమ్ కామెంట్ ని బట్టీ చూస్టే స్నేహితుడు చెప్పడం వలనే పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడని అర్థమవుతోంది.