ప్రపంచానికి మరో హెచ్చరిక
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. గత 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా లక్షా 50వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంది’ అని హెచ్చరించింది.
ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే కఠిన నిబంధనలు అమలు చేయాల్సిందేనని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ అన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వంటి నియమాల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.