బ్రేకింగ్ : తెలంగాణలో 730 కరోనా కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య 500లు దాటి 1000వైపు పరుగులు తీస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 730 కొత్త కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా కేసులు మొదలైన తర్వాత తెలంగాణలో ఒకరోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

ఈ 730 కేసుల్లో ఒక్క జీహెచ్ ఎంసీ పరిధితిలోనే 659 కేసులు నమోదయ్యాయ్. ఇతర జిల్లాల్లో 71 కేసులు నమోదయ్యాయ్. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,802కి చేరింది. ఆదివారం కరోనాతో 7గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 210కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 3,731మంది డిశ్చార్జ్ కాగా, 3,861మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు ఏపీలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీ 477 కొత్త కేసులు నమోదయ్యా. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 929కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 106మంది మృతి చెందారు.