తమిళనాడు రాజకీయాల్లోకి సీఎం జగన్.. !


ఏపీ సీఎం జగన్ అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ జాతీయ ఛానల్ చేసిన సర్వేలో ఏపీ సీఎం జగన్ కి నాల్గో స్థానం దక్కిన సంగతి తెలిసిందే. కష్టకాలంలోనూ ఏపీలో సంక్షేమ పథకాలని అమలు చేస్తుండటం, కొత్త పథకాలని తీసుకొస్తుండటం ఆకట్టుకుంటోంది. అందుకే ఇతర రాష్ట్రాల ప్రజలు సీఎం జగన్ ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. 

తమిళనాడు రాజకీయాల్లోనూ ఏపీ సీఎం జగన్ పేరు మారుమ్రోగిపోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని సీఎం జగన్ ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని.. ఆయన అభిమానులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు చెన్నైలో పోస్టర్లు, బ్యానర్లు వెలిస్తున్నాయ్. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేపు (జూన్ 22) విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేస్తున్న బ్యానర్లలో విజయ్ ని రాజకీయాల్లోకి రావాలని కోరారు.

విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసి.. కేరళ సీఎం విజయన్ మాదిరిగా అవినీతి రహిత పాలన అందించాలి. ఢిల్లీ సీఎం క్రేజీవాల్ మాదిరిగా పాలన చేయాలి. ఏపీ సీఎం జగన్ మాదిరిగా బెస్ట్ సీఎం అనిపించుకోవాలని బ్యానర్లలో పేర్కొన్నారు. ఇప్పుడీ బ్యానర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యానర్ల ని చూసి వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తమిళనాడు రాజకీయాలని ప్రభావితం చేస్తున్నారు. ఏకంగా స్టార్ హీరో విజయ్ అభిమానుల మనసుదోచేశారని గొప్పగ చెప్పుకొంటున్నారు.