ప్రణయ్ ‘మర్డర్’ సినిమా ప్రకటించిన వర్మ


ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రణయ్-అమృతా ప్రాణంగా ప్రేమించుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే అది నచ్చని అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత గర్భవతి. ఆమెని ఆసుపత్రిలో చూపించి వెళ్తున్న సమయంలోనే ప్రణయ్ ని దారుణంగా హత్య చేశారు.

ఆ తర్వాత అమృతా ప్రణయ్ కుటుంబంతోనే ఉంటోంది. తండ్రి అమృతరావుకి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొన్నాళ్లు జైల్లో ఉండి.. బెయిల్ పై బయటికొచ్చిన అమృతరావు ఇటీవల హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మొత్తం ఏపీసోడ్ లో కూతురుపై తండ్రికి ఉన్న అమితమైన ప్రేమకు అద్దం పడుతోంది. ఇప్పుడీ ఈ వాస్తవ ఘటనలపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీయబోతున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా ప్రకటన కూడా చేసేశారు.

‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్‌ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్‌ చేస్తున్నాను’ అని వర్మ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మర్డర్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్‌ లైన్‌ ఉంచారు.  వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి కరుణ క్రాంతి నిర్మాతలుగా ఉండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, మారుతి రావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటిస్తున్నారు.