కరోనా భయంతో నాగశౌర్య పారిపోయాడా ?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయ్. శనివారం తెలంగాణలో ఏకంగా 499 కరోనా కేసులు నమోదయ్యాయ్. సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో.. ఆయన ఇంటిపక్కనే ఉండే యంగ్ హీరో నాగశౌర్య అలర్ట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. నాగశౌర్య ఫ్యామిలీతో కలిసి ఫాంహౌజ్‌కి వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాలు కూడా లేకపోవడంతో హైదరాబాద్‌లోని తన ఫాం హౌజ్‌లో కొద్ది రోజులు ఉండాలని అనుకున్నాడట నాగశౌర్య. ఫోన్ కాల్స్ ద్వారా ఫిలిం మేకర్స్‌కి అందుబాటులో ఉంటాడని సమాచారం. నాగశౌర్య కరోనా భయంతో ఫాం హౌజ్ వెళ్లాడా ? లేదా అంతకుముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారమే అక్కడికి వెళ్లారా ? అన్నది తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కరోనా భయంతో నాగశౌర్య పారిపోయాడనే ప్రచారం జరుగుతోంది.