శ్రీశాంత్ ఆత్మహత్యా యత్నం !
బాలీవుడ్ యంగ్ హీరో శ్రీశాంత్ ఆత్మహత్యతో.. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి, వారసత్వంపై జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో పాటు డిప్రెషన్ గురించి పలువురు స్పందిస్తున్నారు. తమ జీవితంలోనూ డిప్రెషన్ లోకి వెళ్లిన సందర్భాలు, వాటిని ఎలా బయటపడ్డామనే దాని గురించి పంచుకుంటున్నారు. భారత పేసర్ శ్రీశాంత్ కూడా గతంలో డిప్రెషన్ లోకి వెళ్లారట. 2013లో ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకొందామనుకున్నా. కానీ నా కుటుంబం గుర్తొచ్చింది. వారు తనకి ఎప్పుడు తోడుగా ఉన్నారు. వారి కోసమే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనని విరమించుకున్నానని తెలిపారు.
శ్రీశాంత్ లక్కీ హ్యాండ్ అని చెబుతుంటారు. ఆయన భారత్ గెలిచిన టీ20, వన్ డే వరల్డ్ కప్ లోనూ సభ్యుడు. మొత్తం టీమ్ఇండియా తరఫున శ్రీశాంత్ మొత్తం 27టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు తేలడంపై శ్రీ శాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏడేండ్లకు తగ్గించింది. ఈ ఏడాది సెప్టెంబర్తో శ్రీశాంత్ ఏడేండ్ల నిషేధం ముగియనుంది. దీంతో మళ్లీ క్రికెట్ ఆడేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. 2023 వరల్డ్ కప్ జట్టులో కచ్చితంగా స్థానం సంపాదిస్తానని నమ్మకంగా చెబుతున్నారు శ్రీశాంత్.