ఏపీ రాజధాని తరలింపుకు బ్రేక్.. !
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని తరలింపుని వాయిదా వేసింది. శుక్రవారం ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి. ఇప్పట్లో రాజధాని తరలింపు ఉండని చెప్పారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాజధాని తరలింపుని వాయిదా వేశామని మంత్రి తెలిపారు. అయితే కేంద్రం ఆదేశాలతోనే రాజధాని తరలింపుని ఏపీ ప్రభుత్వం వాయిదా వేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఏపీకి మూడు రాజధానులు తీసుకొస్తు జగన్ సర్కార్ బిల్లుని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విశాఖకి రాజధానిని తరలించనున్నారు. చట్టసభలు మాత్రం అమరావతిలోనే ఉంటాయ్. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికీ ఏదో రకంగా నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజా జగన్ సర్కార్ నిర్ణయంతో అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.