రఘు రామకృష్ణంరాజు వెనక చంద్రబాబు.. !?

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణం రాజు అలజడి కొనసాగుతూనే ఉంది. ఆయన సొంత పార్టీపైనే ధిక్కార ధోరణిని వినిపించిన సంగతి తెలిసిందే. ‘మా చిన్న కులంలో చిక్కులు పెట్టకండి’ అంటూ.. వైసీపీలో కుల రాజకీయం జరుగుతుందని ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా పశ్చిమగోదావరి వైసీపీ ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు చేశారు. వారంతా ప్రజలని దోచుకుంటున్నారు. అవినీతి పరులు అంటూ విమర్శణలు చేశారు.

రఘు రామకృష్ణం రాజుపై మొదట్లో కాస్త ఆచితూచి వ్యవహరించిన ప. గోదావరి ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం.. ఆ తర్వాత ఎటాక్ చేసింది. ఇంకా చెప్పాలంటే.. రఘు రామకృష్ణం రాజుని వదులుకొనేందుకు రెడీ అయినట్టు సంకేతాలిచ్చింది. మరోవైపు రఘురామ రాజు కూడా ఏమాత్రం తగ్గలేదు. తన విమర్శణల డోసుని పెంచారు. అంతేకాదు.. తనకి ప్రాణహాని ఉంది. తనని హత్య చేసేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారు. తనకి కేంద్ర బలగాలతో రక్షణ కలిపించాలని లోక్ సభ స్పీకర్ కు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

ఇంతకీ రఘు రామకృష్ణం రాజుకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే.. ? ఆయన వెనకాల తెదేపా అధినేత చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. బాబు డైరెక్షన్ లో రఘు రామకృష్ణంరాజు నడుస్తున్నారని విమర్శించారు. మొత్తానికి..వైసీపీ సొంత వ్యవహారం అనుకున్న రాజు ఏపీసోడ్ కు పసుపు రంగు అంటింది. ఇకపై ఈ ఏపీసోడ్ మరింత రంజుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.