ప్రతిరోజూ పెట్రో మంటలు.. సామాన్యుడు ఏంగానూ ?
దేశంలో పెట్రో రేట్లు ప్రతిరోజూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా 16వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలుపై 33 పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. 16 రోజుల్లో పెట్రోలుపై మొత్తం రు.8.30 పెరగ్గా.. డీజిల్‌పై రు.9.46 పెరిగింది. ధరల నియంత్రణ ఎత్తివేసిన (ఏప్రిల్ 2002) అనంతరం.. ఏదైనా 15 రోజుల్లో చమురు ధరలు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.
అసలే కరోనా కోరల్లో సామాన్యుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి టైమ్ లో సామాన్యుడుకి స్వాంతన కల్పించే పనులు చేయడం మానేసి.. వరుస పెట్రో రేట్లు పెంచుతున్నారు. ఇక కరోనా లాక్‌డౌన్ సమయంలో వచ్చిన కరెంట్ బిల్లులు చూస్తే పేదలకి షాక్ తగిలింది. వందల్లో కరెంట్ బిల్లు వచ్చే వారికి వేలల్లో. వేళల్లో కరెంట్ బిల్లు వచ్చే వారికి లక్షల్లో వచ్చాయ్. దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నించినా.. ప్రజలు ప్రశ్నించినా ప్రభుత్వంలో చలనం మాత్రం లేదు.