విజయ్ దేవకొండ షాకింగ్ న్యూ లుక్ !


సినిమా సినిమాకి ప్రేక్షకులకి షాక్ ఇవ్వడం యంగ్ హీరో విజయ్ దేవరకొండకి అలవాటే. ఇప్పుడు ఆయన కొత్త లుక్ తో షాక్ ఇచ్చారు. ‘పెళ్లిచూపులు’ చేసిన విజయ్ ‘అర్జున్ రెడ్డి’గా కనిపించడంతో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ కోసం విజయ్ చూపించిన వినయాన్ని చూసి ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. విజయ్ షాకులపై షాకులిస్తున్నాడని చెప్పుకొన్నారు.

ఆదివారం విజయ్ దేవరకొండ కొత్త లుక్‌లో కనిపించి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రితో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా.. తప్పులు చేసినా.. రిస్క్ తీసుకున్నా.. సాహసాలు చేసినా.. పోరాడినా.. నీ వెంట నేనున్నానని నాన్న ధైర్యం చెప్పేవారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు డాడీ.. ఐ లవ్ యూ..’ అని విజయ్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో విజయ్ పూర్తి విభిన్నమైన లుక్‌లో కనిపించారు. జుట్టు పెంచుకుని, ప్రత్యేకమైన గడ్డంతో కనిపించారు. ఇప్పుడీ ఈ ఫొటో సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.

ప్రస్తుతం విజయ్ ‘ఫైటర్’లో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకుడు. కరణ్ జోహార్ సహ నిర్మాత. బాలీవుడ్ నటి అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని.. విజయ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ఫైటర్ సినిమా తనకి పేరు తీసుకొస్తుందని అన్నారు.