పరారీలో 70మంది కరోనా రోగులు

ముంబయిలో 70 మంది కరోనా రోగులు అదృశ్యమవ్వడం సంచలనంగా మారింది. తమ రికార్డుల్లో ఆ రోగుల ఆచూకీ లభించడం లేదని బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. వారిని గుర్తించేందుకు పోలీసుల సహాయం కోరింది. రోగులు ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామా తప్పుగా ఇవ్వడం వల్లే ఇలా జరిగినట్లు బీఎంసీ తెలిపింది.

ప్రస్తుతం పారిపోయిన 70 మంది కరోనా రోగుల ఆచూకిని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. తప్పిపోయిన వారి జాబితాను పరిశీలించగా వారంతా ఉత్తర ముంబయిలోని మలాడ్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మలాడ్‌ ఒకటి. ఈ విషయంపై మహారాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి, ముంబయి గార్డియన్‌ మంత్రి అస్లామ్‌ షేక్‌ స్పందించారు. కొందరు కరోనా రోగుల ఆచూకీ లభించడం లేదు. త్వరలోనే వారిని కనిపెట్టి.. వారికి, వారి కుటుంబ సభ్యులకి చికిత్స అందిస్తామని తెలిపారు.