వైరల్ వీడియో : చిరుతకి తాడికట్టి ఊరెగింపు

చిరుత కనిపిస్తేనే వణికిపోతాం. కానీ ఆ చిరుతకి మెడలో తాడుకట్టి.. మేకలా తీసుకెళ్తే ఏమానాలి? ఈ ఘటన నేపాల్ లో జరిగింది. చిరుతకి తాడికట్టి ఊరెగింపుగా తీసుకెళ్లారు. ఇది చేసింది సామన్య ప్రజలు కూడా కాదు. పోలీసులు. అటవీశాఖ పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పర్భత్ జిల్లా జల్జలా గ్రామంలోని పొదల్లో స్థానికులు చిరుతను చూశారు. వెంటనే భయంతో అక్కడినుంచి దూరం వెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక మిలాన్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పులిని బంధించారు. తరువాత దాని మెడకు ఒక తాడు వేసి మేకను తీసుకెళ్లినట్లు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను కొందరు కెమెరాలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులి కూడా మేక, కుక్క లా సాధు జంతువులా ఎలాంటి గాడ్రింపు లేకుండా వెళ్లడం చూడొచ్చు.