ఈమార్కెట్.. ఇకపై ఏ దేశం వస్తువో చెప్పాల్సిందే !

ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన స్వావలంబన భారత్‌కు మద్దతుగా ప్రభుత్వ ‘ఈమార్కెట్’ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఈ మార్కెట్ వెబ్‌సైట్ ద్వారా విక్రయించే ఉత్పత్తులపై దేశాలకు సంబంధించిన మూలాల (కంట్రీ ఆఫ్ ఆరిజిన్‌) వివరాలు పొందుపర్చాలని ఆదేశించింది. నిర్దేశిత సమయంలో వివరాలను నమోదు చేయడంలో విఫలమైతే ఆ ఉత్పత్తులను వెబ్‌సైట్ నుంచి తొలగిస్తామన్నారు.

అన్ని ఉత్పత్తుల తయారీకి వినియోగించే స్థానిక ముడిసరుకుల శాతాన్నీ నమోదు చేయాల్సి ఉంటుందని ఈమార్కెట్ పోర్టల్ సీఈవో తల్లీన్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా భారత్‌లో తయారీ ఫిల్టర్‌ను వెబ్‌సైట్‌లో ఎనేబుల్ చేశామన్నారు. దీని ద్వారా వినియోగదారులు 50 శాతం భారత సామగ్రిని ఉపయోగించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు వీలవుతుందని తెలిపారు.