కరోనాపై రాజకీయాలా ?
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య వెయ్యికి చేరువవుతోంది. సోమవారం ఒక్కరోజే 872కొత్త కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ఫైర్ అవుతోంది. కరోనా నివారణలో తెరాస సర్కార్ విఫలమైందంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించిన సంగతి తెలిసిందే.
నడ్డా వ్యాఖ్యలని తెరాస ప్రభుత్వం గట్టిగానే తిప్పికొట్టింది. కరోనా నివారణకు, చికిత్సకు నిధులివ్వని కేంద్రం.. చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ చేతులు దులుపుకొంటోందని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్న టెస్టింగ్ మిషన్లను వేరే రాష్ట్రాలకు తరలిస్తోందని ఆక్షేపించారు. కరోనాపేరుతో భాజపా నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మొత్తానికి.. కరోనా విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నాయి. కరోనా కిట్స్ కోల్ కత్తాకి తరిలించిన విషయాన్ని మంత్రి ఈటెల ముందే ఎందుకు భయటపెట్టలేదు. తెలంగాణకి కేంద్రం ద్రోహం చేసిందని ఎందుకు ఆరోపించలేదు. మరోవైపు కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీ కిందికి తేవాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ భాజాపా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి పథకాన్ని ఎందుకు తీసుకు రావడం లేదు. కేంద్రమే కరోనా చికిత్స ఖర్చుని భరించవచ్చు కదా ! మొత్తానికి కరోనా విషయంలో తెరాస, భాజాపా రెండు రాజకీయాలు చేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందంతా ఎందుకు అంటే..? త్వరలోనే గ్రేటర్ ఎలక్షన్ ఉన్నాయ్ కదా ! వాటి కోసం మైలేజ్ రావొద్దు మరీ… !