కరోనా ఫలితం తారుమారు
ఎలాంటి లక్షణాలు లేకున్నా.. కరోనా పాజిటివ్ గా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడక్క ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎలాంటి లక్షణాలు లేనివారికి, అసలు బయటికి వెళ్లనివారికి కరోనా పాజిటివ్ గా వస్తున్నాయి. ఇకక్ మంగళవారం ఓ మహిళకి 24 గంటల్లో పాజిటివ్, నెగటివ్ రిపోర్ట్ రావడం చర్చనీయాంశంగా మారింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళ (65)కు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా ఈనెల 21న పాజిటివ్‌గా తేలింది. వెంటనే వైద్యాధికారులు, పంచాయతీ పాలకవర్గం సదరు గ్రామంలో కంటెయిన్మెంట్ జోన్‌ను ప్రకటించారు. అయితే ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్ రావడంతో అనుమానంతో మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటే 22న నెగిటివ్ అని తేలింది. దీనితో గందరగోళంలో మహిళా కుటుంబం, వారి గ్రామం ఉంది.