CBSE టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. CBSE టెన్త్, ఇంటర్ పరీక్షలని రద్దు చేసింది. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. జులై 1 నుంచి 15 వరకు జరగాల్సిన CBSE టెన్త్, ఇంటర్ పరీక్షలని రద్దు చేసినట్టు తెలిపింది.
ఇక ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పది, ఇంటర్ పరీక్షలని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం మాత్రం డిగ్రీ, పీజీ పరీక్షలని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక టెన్త్ పరీక్షలని రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ, పీజీ పరీక్షలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లోనే వీటిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.