ఎమ్మెల్సీగా డొక్కా ఏకగ్రీవం

డొక్కా మాణిక్య ప్రసాద్ స్థానాన్ని ఆయనతోనే పూర్తి చేసింది వైసీపీ. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య ప్రసాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈరోజే నామినేషన్ గడువుకు ఆఖరు తేది. డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైసీపీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. 

తెదేపా తరుపున ఇప్పటి వరకు ఎవరు నామినేషన్ వేయలేదు. దీంతో డొక్కా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీనిపై డొక్కా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తనకి మంచి అవకాశం ఇచ్చారు. ఆయనకి కృతజ్ఝతలు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. మొత్తానికి డొక్కా స్థానంలో డొక్కానే వచ్చారు. కానీ పార్టీ గుర్తు మాత్రమే మారింది.