షోకాజ్ నోటీస్’పై రఘు రామకృష్ణం రాజు షాకింగ్ రిప్లై !

వైసీపీ తనకి ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై ఎంపీ రఘు రామకృష్ణం రాజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తనకి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరు మీదుగా షోకాజ్ నోటీసు ఇచ్చారు. అసలు ఎన్నికల సంఘం వద్ద ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉన్న వైసీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు ? అని రఘు రామకృష్ణం రాజు ప్రశ్నించారు.

అసలు పార్టీ పేరు మీదనే రఘు రామకృష్ణం రాజు ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు పార్టీ పేరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీయా ? లేక యువజన రైతు కాంగ్రెస్ పార్టీనా ? నాకు పంపించిన షోకాజ్ నోటీస్ పై క్లారిటీ ఇవ్వాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాదు.. అసలు వైసీపీకి క్రమ శిక్షణ కమిటీ  ఉందా ? ఉంటే దానికి ఎన్నికల సంఘం ఆమోదం ఉందా ? ఉంటే.. దానికి సంబంధించిన మినిట్స్ ని నాకు పంపించండి రఘు రామకృష్ణం రాజుసూటిగా అడిగారు. మొత్తానికి తనకి షోకాజ్ నోటీస్ పంపించిన ఎంపీ విజయసాయి రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు రఘు రామకృష్ణం రాజు.