ఏపీ ఎమ్మెల్యేలు.. వరుసగా హోం క్వారంటైన్ లోకి !
ఏపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వరుసగా హోం క్వారంటైన్ లోకి వెళ్తున్నారు. ఏపీలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఎస్. కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ఈయనే. ఇటీవలే శ్రీనివాసరావు అమెరికా వెళ్లొచ్చారు. రాగానే కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగటివ్ వచ్చింది.
ఎందుకైనా మంచిదని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి ఎమ్మెల్యే కడుబండి హాజరుకాలేదు. కానీ ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మిగితా ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా గడిపారు. ఆ తర్వాత సొంత జిల్లా విజయనగరంలో కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. స్థానికంగా పర్యటించారు. అయితే ఆ తర్వాత కడుబండికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఏపీ ఎమ్మెల్యేలంతా ఉలిక్కిపడ్డారు.
ఎస్. కోట ఎమ్మెల్యేతో కలిసి తిరిగిన కోడమూరి ఎమ్మెల్యే సుధాకర్ కి తాజాగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో ఏపీ ఎమ్మెల్యేలంగా వరుసగా హోం క్వారంటైన్ లోకి వెళ్లేలా కనిపిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు కరోనా కలవరంలో ఉన్నారు. ఎప్పుడు ఎవరికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వస్తుందో అనే టెన్షన్ లో ఉన్నారు. మరీ.. ఈ భయం నుంచి సీఎం జగన్ సేఫ్ యేనా ? అంటే.. అదేం లేదు. కరోనాకి రాజు-బంటు అనే తేడా లేదని చెబుతున్నారు.