ఇంటి వద్దే కరోనా చికిత్స
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకి ఇంటి వద్దే చికిత్స అందించే ప్రయత్నం చేస్తోంది. శుక్రవారం ఇంటి వద్ద చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి ఆరోగ్యం గురించి సీఎం క్రేజీవాల్ వాకబు చేశారు. ఫోన్ చేసి మాట్లాడారు. ఆక్సిజన్ లెవెల్ గురించి, వ్యాధి లక్షణాలు ఉన్నాయా ? అని అడిగారు. దీనికి రోగి తన ఆక్సిజన్ లెవెల్ 97 అని, తనకు కోవిడ్ లక్షణాలు లేవని చెప్పారు. ఆరోగ్య సిబ్బంది ప్రతిరోజూ పోన్ చేసి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారని తెలిపారు.
దీంతో ప్రత్యేక గదిలో ఉండాలని, తద్వారా మిగతా కుటుంబ సభ్యులకు ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పాటించాలని సీఎం క్రేజీవాల్ సూచించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆక్సిజన్ లెవెల్‌ను చెక్ చేసుకోవాలని తెలిపారు. ఇక రోజుకు 3000 వరకు నమోదువుతున్నాయి. అయితే కరోనాను అరికట్టేందుకు ప్లాస్మా థెరపీ చక్కగా ఉపయోగపడుతోందని సీఎం క్రేజీవాల్ అన్నారు. దీనికి కావలసిన అనుమతులు కూడా రాష్ట్రంలోని కొన్ని ఆసుపత్రులకు లభించాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న బాధితులను ప్లాస్మాథెరపీతో కాపాడలేకపోవచ్చు. కానీ తక్కువ లక్షణాలతో బాధపడుతున్న వారిని మాత్రం ఈ విధానంతో కాపాడవచ్చని కేజ్రీవాల్ తెలిపారు.