హైదరాబాద్ లో స్వచ్చంధ లాక్‌డౌన్

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య వెయ్యికి చేరువగా నమోదవుతున్నాయ్. ఇప్పటికే సేకరించిన షాపింల్స్ ని పూర్తికాని నేపథ్యంలో రెండ్రోజుల పాటు కరోనా టెస్టులని హైదరాబాద్ లో బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలంగాణలో 10,444 కరోనా కేసులు నమోదయ్యాయ్. 225 మంది కరోనాతో మృతి చెందారు.

ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఆ డిమాండ్ ని ప్రభుత్వం ఏమాత్రం పటించుకోవడం లేదు. మరోసారి లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదన్నట్టు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు స్వచ్చంధంగా సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించుకుంటున్నారు.

ఇప్పటికే సికింద్రాబాద్ సూర్య టవర్స్, జనరల్ బజార్, ప్యారాడైజ్, బేగం బజార్ లో స్వచ్చంధ లాక్‌డౌన్ ప్రకటించారు వ్యాపారస్థులు. తాజాగా చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ మర్చంట్ అసోసియేషన్ తరఫున స్వచ్ఛందముగా 15 రోజులపాటు దుకాణాలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చార్మినార్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ బుక్స్ షాపు యజమానులు సైతం స్వచ్ఛందముగా దుకాణాలను మూసివేశారు.