ఏ హోదాలో విజయసాయి షోకాజ్ ఇచ్చారు ?
నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. వైసీపీ పార్టీ పేరు, పార్టీలో విజయసాయి రెడ్డి హోదాపై ఆయనకున్న అనుమానాలని ఎన్నికల సంఘం అధికారుల ముందు చర్చించినట్టు తెలిసింది.
పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని నమోదు చేసి.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అని ఎందుకు పిలుస్తున్నారు ? ప్రాంతీయ పార్టీగా నమోదైన వైకాపాకు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు ? అని ఎంపీ అధికారుల ఎదుట ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే విజయసాయి రెడ్డి ఏ హోదాతో తనకు షోకాజ్ నోటీసు ఇచ్చారనే విషయమూ ప్రస్తావనకు తీసుకొచ్చినట్లు సమాచారం. షోకాజ్ విషయంలో సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున… ఈ వ్యవహారంలో ఎంపీగా తనకున్న హక్కులేంటి అనేది తెలుసుకున్నారని సమాచారమ్.