హైదరాబాద్ లో భారీ వర్షం

నైరుతీ రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు నిలిచిపోయింది. కొన్ని చోట్లు చెట్లు విరిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయ్. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

అసలే కరోనా ఫీవర్ లో ఉన్న హైదరాబాద్ కు వర్షాల రాకతో మరింత కష్టం కానుంది. వాతావరణం చల్లబడితే కరోనా ఇంకా విజృంభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు