దోమల బెడదకు కేటీఆర్ సూచనలు

మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మూసీ రివర్ డెవలప్మంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్‌ రెడ్డి, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.మూసీ నదిలో చెత్త వేయకుండా, కబ్జాలకు గురికాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్‌ అన్నారు.

మూసీలో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను తీయించే కార్యక్రమం కొనసాగించాలి. దీంతో మూసీ పరివాహక ప్రాంతంలో దోమల బెడదను కొంతవరకు తగ్గించగలిగే అవకాశం ఉంది మూసీ అభివృద్ధితోపాటు సుందరీకరించడంపైనా దృష్టిసారించాలి. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్రణాళికలు, మూసీ అభివృద్ధి ప్రణాళికలు సమన్వయంతో చేయాలని కేటీఆర్‌ సూచించారు.