మెగాస్టార్ వద్దకు దాసరి తనయుల ఆస్తి పంచాయతీ !

దర్శకరత్న దాసరి తనయుల (ప్రభు, అరుణ్) ఆస్తి పంచాయతీ మరోసారి తెరపైకి వచ్చింది. అరుణ్ గురువారం రాత్రి ప్రభు ఇంటికి వెళ్లి గొడవ చేశాడట. దీనిపై శుక్రవారం సాయంత్రం జూబ్లీహీల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ప్రభు. అరుణ్ వలన తనకి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకొని తమ ఆస్తి పంచాయతీకి పరిష్కారం చూపాలని కోరారు. ఈ నేపథ్యంలో దాసరి తనయుల పంచాయతీలో మధ్యవర్తిత్వం కోసం మెగాస్టార్ రంగంలోకి దిగినట్టు తెలిసింది.

ఈరోజు లేదా రేపు దాసరి తనయులతో చిరంజీవి భేటీ కానున్నారు. ఆయనతో పాటు మోహన్ బాబు మరికొందరు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఉంటారని తెలుస్తోంది. మోహన్ బాబు దాసరికి సొంత కొడుకు లెక్క. ఆ చనువుతోనే గతంలో దాసరి కొడుకుల పంచాయతీని పరిష్కారించే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. కానీ కొలిక్కిరాలేదు. దీంతో మోహన్ బాబు చేతులెత్తేశారు. ఇప్పుడు మెగస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. మరీ.. ఆయన వలన అవుతుందా ? లేదా.. ?? అన్నది చూడాలి.