కీర్తి సురేష్’తో చరణ్ బిజినెస్ చేయబోతున్నాడా ?


కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్.. అంతకుమించి అనిపించుకుంది. ‘మహానటి’ సావిత్రి బయోపిక్ తో కీర్తి సురేష్ కీర్తి మరింతగా పెరిగిపోయింది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెటెండ్ సినిమాలతో ఆకట్టుకుంటోంది. లేడీ సూపర్ స్టార్ అనిపించుకొనే క్రమంలో ఉంది. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ నయనతార స్థానానికి చెక్ పెట్టేలా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ తో మంచి బిజినెస్ ప్లాన్ చేశాడా ? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో కీర్తి సురేష్ తో ఓ వెబ్ సిరీస్ ని నిర్మించాలనే ప్లాన్ లో చరణ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటికే చరణ్ కీర్తితో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా సర్కారు వారి పాట కోసం కీర్తి సురేష్ ని తీసుకున్నారు. స్వయంగా మహేష్ కీర్తితో మాట్లాడి ఒప్పించినట్టు తెలిసింది.