ఇండస్ట్రీ మీటింగ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్

షూటింగ్స్ అనుమతి కోసం సినీ పెద్దలు పెద్ద ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తనసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో వివాదాలు చోటు చేసుకున్నాయ్. తనని పిలవలేదని బాలయ్య ఫైర్ అయ్యాడు. దానికి మెగాబ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందనే భావన కలిగింది. ఫైనల్ గా షూటింగ్ లక్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిచ్చాయ్.

అయినా.. సినిమా షూటింగ్ లు ప్రారంభంకావడంలేదు. ఇటీవల ప్రారంభమైన ఒకట్రెండు సీరియల్స్ షూటింగ్ లకి బ్రేకులు పడుతున్నాయి. షూటింగ్ లో పాల్గొంటున్న నటీనటులకి కరోనా పాజిటివ్ గా తేలడం మాత్రమే ఇందుకు కారణం. తాజాగా ఇండస్ట్రీ మీటింగ్ లపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తాజా చిత్రం నగ్నం ఓటీటీ రిలీజ్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. అసలు ఇండస్ట్రీ పెద్దలు మీటింగ్ లు పెట్టి ఏం చేశారో అర్థం కావడంలేదన్నారు. అసలు మీటింగులు పెట్టి ఏం చేశారు ? ఏం సాధించారు ? అసలు నాకేం అర్థంకావడం లేదన్నారు వర్మ.