మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం
కరోనా కష్టకాలంలోనూ ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలని తీసుకొస్తోంది. గిరిజన మహిళలు, శిశువులకు అదనపు పౌష్టికాహారం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనుంది. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పేరుతో 77 గిరిజిన మండలాల్లో ఈ పథకం అమలుకు విధివిధానాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలుకు కార్యాచరణను ప్రభుత్వం రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారానికి ఒక్కో లబ్ధిదారుకు నెలకు రూ.600, గర్భిణులకు, బాలింతలకు ఇంటికి తీసుకెళ్లే రేషన్ కోసం నెలకు రూ.500, శిశువుల పౌష్టికాహారం కోసం నెలకు రూ.533 ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.