‘పీవీ’ది 360డిగ్రీల పర్సనాలిటీ
‘పీవీ మన తెలంగాణ ఠీవి’ అన్నారు సీఎం కేసీఆర్. మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇక ఈ ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ పీవి గొప్పదనం గురించి గొప్పగా చెప్పారు.
పీవి నరసింహారావుది 360 డిగ్రీల పర్సనాలిటీ. ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయనకి అన్నిరంగాల్లో అనుభవం ఉంది. పీవీ ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ సంస్కరణలు చేసేవారు. రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణలు చేశారు. ఆయనకి 1000ఎకరాలు ఉంటే… ఓ 200 ఎకరాలు ఉంచుకొని మిగితా 800 ఎకరాలని పేదలకి పంచిన గొప్పనేత. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ పాఠశాలలని తీసుకొచ్చారు. జైళ్లశాఖ బాధితులు నిర్వహించినప్పుడు ఓపెన్ జైళ్లన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశ ఆర్థిక ప్రగతి ఇలా ఉండటానికి కారణం పీవీ తీసుకొచ్చిన సంస్కరణలేనని సీఎం కేసీఆర్ అన్నారు.
ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన పీవీ మన తెలంగాణ ఠీవీ అన్నారు సీఎం కేసీఆర్. పీవీ పట్ల ఒక్కటే లోటుగా ఉంది. అదే ఆయనకి భారతరత్న రావాలి. పీవీకి భారతరత్న ఎందుకు రాలేదు అనే కారణాలు మరో సందర్భంలో చెబుతానన్నారు.