టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్’లు భారత్ లో నిషేధం

సామాన్యుడి డిమాండ్ ని కేంద్ర నెరవేర్చింది. చైనా యాప్ లని భారత్ లో బ్యాన్ చేసింది. ఇటీవల భారత్‌ -చైనా సరిహద్దులో గల్వాన్‌ వ్యాలీ వద్ద నెలకొన్న భీకర ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 19మంది జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. ఇరు దేశాలు సైనికులని మోహరించాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం ఓవైపు శాంతియుతంగా చర్చలు జరుపుతూనే.. మరోవైపు, చైనా ఆగడాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. చైనా ఉత్పత్తులు, చైనా పేరుతో తయారై భారత్‌లో అనేక రకాలుగా చలామణి అవుతున్న యాప్‌లు దేశ భద్రత, రక్షణకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాయని పసిగట్టిన భారత్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.