చైనాలో మళ్లీ లాక్ డౌన్
కరోనా మహమ్మారి పుట్టిన దేశం చైనాలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. చైనాలోని వ్యూహాన్ లో కరోనా మహమ్మారి పుట్టింది. ప్రపంచ దేశాలకి వ్యాపించింది. అయితే మిగితా దేశాల కంటే చైనా ముందుగానే కోలుకుంది. ఇటీవలే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లాక్ డౌన్ ఎత్తేశారు. అయితే ఇటీవల కాలంలో చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.
చైనాలోని బీజింగ్ లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా బీజింగ్ పక్కన ఉన్నహెబెయ్ ప్రావిన్స్ లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో బీజింగ్ చుట్టుపక్కల 150కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ ను ప్రకటించారు. కరోనా పుట్టిన ప్రాంతం వుహాన్ మాదిరిగానే బీజింగ్ లో కఠిన ఆంక్షలు విధించడానికి సిద్దమౌన్నారు. లాక్ డౌన్ వేళ నిత్యావసరాల కోసం ఇంటినుండి భయటకు రావడానికి కేవలం ఒక్కరికి మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.