పెట్రో ధరల పెరుగుదలకి బ్రేక్.. కానీ !
దేశంలో పెట్రోధరలు నాన్ స్టాప్ గా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత 21రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోధరల పెంపునకి ఆదివారం మాత్రం బ్రేక్ పడింది. బహుశా.. ఆదివారం సెలవ్ అని కావొచ్చు. ఇక సోమవారం యధాథతంగా మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలను చమురు సంస్థలు పెంచాయి.
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.43, లీటర్ డీజిల్ ధర రూ.80.53కి చేరింది. జూన్ 7 నుంచి 22 రోజులపాటు వరుసగా పెట్రో ధరల పెరిగాయి. ఇప్పటివరకు డీజిల్‌పై మొత్తం రూ.10.39, పెట్రోల్‌పై రూ.9.23 పైసలు పెరిగాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.