ఎఫైర్ల గురించి ఓపెన్’గా చెప్పేసిన హీరోయిన్
సినీ ఇండస్ట్రీలు సర్వసాధారణమే. అయితే వాటి గురించి బయటకి చెప్పడానికి ఏ హీరోయిన్ ఇష్టపడదు. యంగ్ హీరోయిన్ ఇషా చావ్లా మాత్రం ఎఫైర్ల గురించి ఓపెన్ గా చెప్పేసింది. ఇప్పటివరకు ఇద్దరితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేశానని చెప్పింది.
‘నా లైఫ్ లో ఇప్పటివరకు 2 ఎఫైర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి అతిపెద్ద రిలేషన్ షిప్. దాదాపు 5-6 ఏళ్లు మేం రిలేషన్ షిప్ లో ఉన్నాం. 2015 వరకు అది కొనసాగింది. రెండో రిలేషన్ షిప్ చిన్నది. ప్రస్తుతానికైతే నాకు ఎలాంటి రిలేషన్ షిప్స్ లేవు. నేను సింగిల్ అని చెప్పేసింది. అంతేకాదు.. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది. ప్రతి ఒక్కర్లో లోపాలు ఉంటాయి. నేను కూడా పెర్ ఫెక్ట్ కాదు’ అని చెప్పుకొచ్చింది. నిజంగా ఇషా చావ్లా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.