వ్యవసాయం చేస్తున్న ధోని (వీడియో)

కరోనా లాక్‌డౌన్ తో క్రీడాకారులు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో నచ్చిన పనులు చేసుకొంటున్నారు. కొత్త పనులు నేర్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారు. సహచరులు, మాజీ ఆటగాళ్లతో ముచ్చటిస్తున్నారు. ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.

అయితే టీమిండియా మాజీ కెప్టెన్ మాత్రం సలైంట్ గా వ్యవసాయం చేస్తున్నారు. తనకి సేంద్రియ వ్యవసాయం చేయడం ఇష్టమని ఇటీవల ఓ వీడియోలో ధోని తెలిపిన సంగతి తెలిసిందే. పుచ్చకాయలు, బొప్పాయిలు ఈ పద్ధతిలో ఎలా సాగు చేయాలో తెలుసుకుంటున్నట్లు వెల్లడించాడు.

ఈ నేపథ్యంలోనే ధోనీ వ్యవసాయ పనులు ప్రారంభించాడు. ట్రాక్టర్‌ ఎక్కి పొలం దున్నుతున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ధోని రిటైర్మెంట్ పై ప్రచారం సాగుతూనే ఉంది. ఐపీఎల్ లో ధోని రాణిస్తే.. టీ20 వరల్డ్ లో ఆడే అవకాశం వస్తుందని అందరు భావించారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్ జరగకపోతే.. ధోని మరోసారి మైదానంలో చూసే అవకాశం ఉండదేమోనని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.