బ్రేకింగ్ :  ‘అన్ లాక్ 2.O’ గైడ్ లైన్స్ విడుదల

‘అన్ లాక్ 2.O’ గైడ్ లైన్స్ ని కేంద్రం విడుదల చేసింది. కంటోన్మెంట్ జోన్స్ వెలువల కొన్ని సడలింపులు ఇచ్చింది. విద్యాసంస్థలు, థియేటర్స్, సభలు, సమావేశాలకి జులై 31 వరకు అనుమతులు ఇవ్వలేదు. అయితే, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల శిక్షణ సంస్థలకి మాత్రం జులై 15 నుంచి అనుమతి ఇచ్చారు. ఇక రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాత్రి కర్ప్యూ కొనసాగనుంది.

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్ 5.ఓ వైపు మొగ్గు చూపుతుందా ? లేదా  ‘అన్ లాక్ 2.O’ చేస్తుందా ?? అన్న ఉత్కంఠకి తెరపడింది. అన్ లాక్ 2.Oలో జనాలు గుమిగూడే వాటికి అనుమతులు ఇవ్వలేదు. కంటోమెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా.. మిగితా ప్రాంతాల్లో సండలింపు ఇచ్చే ప్రయత్నం చేసింది.