ఆమీర్ ఖాన్’కు కరోనా !?

సామాన్యులు, సెలబ్రిటీలు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కుటుంబంలో కరోనా కలవరం మొదలైంది. అమీర్ సహాయకులకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అమీర్ కుటుంబ సభ్యులు గృహ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా అమీర్ ఖాన్ నే తెలిపారు.

తన సహాయకులకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మా ఫ్యామిలీ హోం క్వారంటైన్ లోకి వెళ్లింది. అయితే తన తల్లికి కరోనా నెగటివ్ రావాలని ప్రార్థించమని అమీర్ అభిమానులని కోరారు. ఇటీవలే బోనీ కపూర్ ఫ్యామిలీలోనూ కరోనా కలవరం ఏర్పడిన సంగతి తెలిసిందే. సహాయకులకి కరోనా రావడంతో.. బోనీ కపూర్ ఫ్యామిలీ హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. కరోనా టెస్టుల్లో వారికి నెగటివ్ రావడం అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్ ఫ్యామిలీ కూడా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.