మొహం చూపించకుండా అన్నీ చూపించేసింది


పేరులోనే అదా. కానీ అందాల ఆరబోతలో మాత్రం ఆదా పాటించదు. రకరకాల ఫీట్ల రూపంలో అన్నీ చూపించేస్తుంది. ఎప్పటికే అర్థమయి ఉంటుంది ఆమె ఆదా శర్మ అని. ఈ పొడుగుకాళ్ల సుందరి సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంటుంది. ‘హార్ట్ ఎటాక్‌` సినిమాతో అదా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

అదా అందాలు చూస్తే.. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ ఈ అమ్ముడికి లక్కు కలిసిరాలేదు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’ తదితర చిత్రాల్లో మెరిసింది. బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం ఉంటే సినిమాలు లేకపోతే.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసుకుంటూ తృప్తి చెందుతోంది. తాజాగా అదా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేసింది.

ఇందులో మొహానికి చేయి అడ్దం పెట్టుకొని నడుము అందాలని చూపే ప్రయత్నం చేస్తోంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్స్.. మొహం చూపించకుండా అన్నీ చూపించేస్తోందని కామెంట్ చేస్తున్నారు. అదా నటించిన ఆఖరి తెలుగు చిత్రం కల్కీ. ప్రసుతం అదా చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. ఒకట్రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టుంది.