గుడ్ న్యూస్ : రికవరీ రేటు పెరుగుతోంది

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 19వేల కేసులు నమోదౌతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,85,493కి చేరింది. అయితే ఈ సంఖ్యను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. 60శాతానికి చేరిందై పరిశీలకి చెబుతున్నారు. మొత్తం కేసుల్లో 3,47,979 మంది కోలుకున్నారు.

మార్చి నెలాఖరు నాటికి రికవరీ రేటు కేవలం ఏడు శాతం. కాగా, మే ఆరంభంలో ఇది 26 శాతానికి చేరుకుంది. మే 18 నాటికి 38 శాతానికి ఎగబాకిన ఈ రేటు… ఆ నెల చివరికల్లా ఏకంగా 47.7కు చేరింది. ఇక జులై 1, 2020 నాటికి సుమారు 60 శాతానికి రికవరీ రేటు పెరగడం సంతోషించాల్సిన విషయం.