ఈటెల.. ఓ పోస్ట్ మ్యాన్ !
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై షాకింగ్ కామెంట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేవలం కరోనా బులిటెన్ విడుదల చేయడానికే మంత్రి ఈటెల ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు. కరోనా వైరస్ నియంత్రణలో తెలంగాణ సర్కార్ ఘోరంగా వైఫల్యమైందని జగ్గారెడ్డి అన్నారు.
ఈ టైమ్ లో కావాల్సింది.. కాళేశ్వరం, కొండపోచమ్మ ప్రాజెక్ట్లుకాదు. కరోనా బాధితులను రక్షించడమే సీఎం బాధ్యత కావాలి. ఉన్న నిధులన్నీ ప్రాజెక్ట్‌లకు మళ్లీంచారు. ఆరోగ్య శ్రీలో రూపాయి లేదన్నారు జగ్గారెడ్డి. ప్రజల్ని కాపాడుతారా ? లేక కాంట్రాక్టర్ల జేబులు నింపుతారా ? అని ప్రశ్నించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులకు సరైన సదుపాయాలు లేవన్నారు.