ఈ నెలలోనే నితిన్ పెళ్లి

ఏప్రిల్ లో జరగాల్సిన హీరో నితిన్ పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 2 నెలలు ఆగి పరిస్థితులు చక్కబడిన తర్వాత దుబాయ్ లో గ్రాండ్ గా  పెళ్లి చేసుకోవాలని నితిన్ అనుకున్నాడు. కానీ ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించడం లేదు. అందుకే హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌజ్ లో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు నితిన్. ఈ నెల 26నే నితిన్ పెళ్లి జరగనుందని సమాచారమ్.

గత 8 యేళ్లుగా నితిన్-షాలినీ ప్రేమించుకుంటున్నారు. భీష్మ సినిమా రిలీజ్ టైమ్ లో తన ప్రేమ సంగతి బయటపెట్టాడు ఈ హీరో. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెతో నిశ్చితార్థం కూడా కానిచ్చేశాడు. ఈ నెలలో వివాహబంధంతో వీళ్లిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి సింపుల్ గా చేసుకున్నా.. కరోనా ప్రభావం తగ్గాక సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ గా పార్టీ ఇవ్వనున్నాడని తెలిసిందే.