అమెజాన్’తో ప్రియాంక మరో ఒప్పదం
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇప్పటికే అమెజాన్’తో కలిసి రెండు ఒప్పందాలు చేసుకుంది. ‘సంగీత్’ అనే నాట్యానికి సంబంధించిన రియాలిటీ షో ఒకటి కాగా.. మరొకటి ‘సిటాడెల్’ అనే స్పై కథాంశంతో కూడిన షో రెండోది. తాజాగా అమెజాన్ తో ప్రియాంక భారీ ప్రాజెక్టు కోసం సంతకం చేశారు.
రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ కోట్లాది రూపాయల విలువ గల ఒప్పందం ద్వారా.. ఈ మాజీ మిస్ వరల్డ్, అంతర్జాతీయ బుల్లి తెరపై మరోసారి కనిపించనున్నారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ టీవీ కార్యక్రమాల్లో మరింత భారతీయతను ప్రతిబింబింప చేస్తాం. మహిళలకు సంబంధించిన కథలకు దీనిలో ప్రాధాన్యముంటుందని ప్రియాంక తెలిపింది.