జులై 27 నుంచి స్కూల్స్ రీ ఓపెన్
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మృతుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలని ఇప్పట్లో తెరచే అవకాశాలు కనిపించడం లేదు. అన్ లాక్ 2లోనూ విద్యా సంస్థలకి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. సెప్టెంబర్ వరకు కూడా విద్యా సంస్థలు తెరచుకొనే పరిస్థితులే కనిపించడం లేదు. అయితే మిగితా రాష్ట్రాలకి భిన్నంగా హర్యానా ప్రభుత్వం ఈ నెలలోనే స్కూల్స్ తెరచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
జులై 1 నుంచి జులై 26 వరకు వేసవి సెలవులుగా ప్రకటించిన హర్యానా ప్రభుత్వం జులై 27 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. అయితే కాలేజీలు, విశ్వవిద్యాలయాల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే కేంద్రం గైడ్ లైన్స్ కాదని హర్యానా ప్రభుత్వం స్కూల్స్ రీ ఓపెన్ కి ఎలా అనుమతులు ఇస్తుంది ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.