ఈ నెల 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ పొడగింపు !

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ లో ‘అన్ లాక్’ ఫార్ములాని ఫాలో అవుతోంది కేంద్ర ప్రభుత్వం. జులై 31 వరకు లాక్‌డౌన్ ని పొడగించిన కేంద్రం ‘అన్ లాక్ 2’లో భాగంగా మరిన్ని సడలింపులు ఇచ్చింది. జనాలు గుమిగూడే వాటికి మాత్రమే నో చెప్పేసింది. థియేటర్స్, సభలు, సమావేశాలకి నో చెప్పింది. మిగితా వాటిని అన్ లాక్ చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ ని ఈ నెల 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఓ ప్రకటన చేశారు. మరోవైపు హైదరాబాద్ సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 15రోజుల పాటు హైదరాబాద్  లాక్‌డౌన్ చేసే ఆలోచనలో ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.