యాప్’ల బ్యాన్ చైనాకు ఎంత నష్టమో తెలుసా ?

చైనాపై భారత్ డిజిటల్ స్ట్రయిక్ చేసిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లని భారత్ నిషేధించింది. యాప్‌ల నిషేధంతో డ్రాగన్‌ కంపెనీలపై దెబ్బ బాగానే పడిందని తెలిసింది. నిషేధం వల్ల టిక్‌టాక్‌, హెలో యాప్‌ల మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఏకంగా రూ.45వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) నష్టపోనుందని చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

ఇక భారత్‌ నిషేధించిన 59 యాప్‌లు మొత్తంగా రూ.70-80వేల కోట్ల వరకు నష్టపోయే అవకాశముందని తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో గత నెల భారత, చైనా సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ డిజిటల్ స్ట్రయిక్ చేసింది.