కరోనా రికవరీ రేటు ఏ రాష్ట్రంలో ఎంత ?

దేశంలో కరోనా విజృంభిస్తోంది. అదే సమయంలో రికవరీ రేటు కూడా పెరుగుతోంది. భారత్ లో రికవరీ రేటు 60శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటినా యాక్టివ్ కేసులు 2,26,947 మాత్రమే ఉన్నాయి. వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,59,859కి చేరింది.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక జాబితాను రూపొందించింది. టాప్‌-15 రాష్ట్రాల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ పదో స్థానంలో ఉన్నది.

కరోనా రికవరీ రేటు రాష్ట్రాలవారీగా :

* మహారాష్ట్ర

* ఢిల్లీ

* తమిళనాడు

* గుజరాత్

* ఉత్తరప్రదేశ్

* రాజస్థాన్

* పశ్చిమబెంగాల్

* మధ్యప్రదేశ్

*  హర్యానా

* తెలంగాణ

*  కర్ణాటక

* బీహార్

*  ఆంధ్రప్రదేశ్

* అసోం

* ఒడిశా