కరోనా టెస్టులకి మరోసారి బ్రేక్ ?

తెలంగాణలో కరోనా టెస్టుల విషయంలో కేంద్రం అసంతృప్తిగా ఉంది. కరోనా టెస్టులకి బ్రేక్ వేయడంపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. అయితే బ్రేక్ తర్వాత ప్రభుత్వాసుపత్రుల్లో బుధవారం నుంచి తిరిగి కరోనా టెస్టులు మొదలయ్యాయ్. టెస్టులు చేసే ఆసుపత్రుల జాబితాని కూడా పెంచారు. మరోవైపు కరోనా టెస్ట్‌లకు కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌ల్లో మరోసారి బ్రేక్ పడింది.

నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో టెస్టులు బంద్ అయ్యాయి. ఐసీఎమ్మార్ నిబంధనల ప్రకారం శానిటైజేషన్ కోసం ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులను నిలిపివేశారు. ల్యాబ్‌లను శానిటైజేషన్‌తో పాటూ, ల్యాబ్ సిబ్బందికి కరోనా టెస్టుల సేకరణ, టెస్టింగ్‌లపై ట్రైనింగ్ అప్డేట్ చేయనున్నారు.