విండీస్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్(95) కన్నుమూశారు. 2019 జూన్‌లో వీక్స్‌కు తొలిసారి గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం వీక్స్ కన్నుమూశారు.
48 టెస్టుల్లో సంచలన ప్రదర్శన చేసిన వీక్స్ 58.61 సగటుతో 4,455 పరుగులు సాధించాడు. టెస్టుల్లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఐదు శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్ వీక్స్ నే. 1958లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 1995లో బ్రిటిష్ అత్యుత్తమ పురస్కారమైన నైట్‌హుడ్‌ను వీక్స్ అందుకున్నాడు. రీటైర్మెంట్ తర్వాత సుదీర్ఘకాలం ఐసీసీ మ్యాచ్ రిఫరీగా కూడా వీక్స్ పనిచేశారు. వీక్స్ మృతిపట్ల విండీస్ క్రికెట్ బోర్డుతో పాటు పలు దేశాల క్రికెట్ బోర్డులు, క్రికెటర్లు సంతాపం తెలియజేశారు.