మట్టిస్నానం చేసిన బాలీవుడ్ హీరోయిన్
అందం కోసం హీరోయిన్స్ ఏ పని చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. అందం, ఫిట్నెస్ పెరుగుతుందని.. బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఒంటి నిండా ఎర్రమట్టి రాసుకొని ఎండలో నిల్చుంది. గులాబీ రంగు బికినీ ధరించి ఒంటి నిండా ఎర్రమట్టితో నిల్చున్న ఫొటోలను నర్గీస్ ఇన్స్టాలో పంచుకుంది.
“జీవితంతో పాటు శరీరంలోని మలినాలను ఇలా ఒక్కోసారి బయటకు పంపే పనిచేస్తుండాలి. అప్పుడే కొత్త అందంతో మెరుస్తాం. ఎర్రమట్టి స్నానం శరీరంలోని మలినాలను తొలిగించడమే కాదు.. కొత్త సాంత్వన ఇస్తుంది. మట్టి పూసుకొని ఎండలో నిల్చోవడం వల్ల విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది” అంటూ పోస్ట్ చేసింది.