చైనా వెబ్‌సైట్ వీబో నుంచి ప్రధాని అవుట్
చైనాపై భారత్ డిజిటల్ స్ట్రయిక్ చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడం, భారతీయుల డేటా చైనా సర్వర్లలోకి వెళ్తుండటం, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలుగుతుందని టిక్‌టాక్, హెలో, షేర్‌ఇట్ సహా 59 చైనీస్ యాప్‌లను కేంద్రం నిషేధించింది. తాజాగా చైనా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ వీబో నుంచి ప్రధాని నరేంద్రమోదీ వైదొలిగారు. బుధవారం ఉదయం నుంచి ఆయన అకౌట్ ఖాళీగా కనిపించింది.
ప్రధాని వీబో అకౌంట్లో మొత్తం 115 పోస్టులు ఉన్నాయి. 2,44,000 మంది అనుసరిస్తున్నారు. వీఐపీ అకౌంట్ ఖావడంతో వీటిని తొలగించేందుకు సంక్లిష్ట పక్రియ అనుసరించాల్సి ఉంటుంది. అనుమతి కోరగా చాలా ఆలస్యంగా అంగీకరించారని సమాచారం. ఆ తర్వాత అన్ని పోస్టులను మాన్యువల్‌గా తొలగించినప్పటికీ ఇంకా రెండు చిత్రాలు అలాగే ఉన్నాయి. మోదీ, జిన్‌పింగ్ కలిసుకున్న చిత్రాలు కావడే కారణం. తమ అధ్యక్షుడి చిత్రాలను తొలగించేందుకు ఈ చైనా కంపెనీకి ప్రత్యేక అనుమతులు అవసరం అవుతాయట. అందుకే ఆ రెండు ఫోటోలని తొలగించేందుకు ఇంకాస్త సమయం పట్టనుంది.